English | Telugu

సీఎస్ సెప్పినారూ.. సీఎం సెప్పినారూ.. వైద్యులందరూ సెప్పినారూ.. ఒక్క సారి వచ్చిపోన్నా.. నానన్నా

గౌరవ వైద్య ఆరోగ్య మంత్రి గారూ అధైర్య పడకండి.. ఏపీకి కరోనా రాదు..వచ్చినా మన దగ్గర మంచి మందులున్నాయని ముఖ్యమంత్రిగారే చెప్పారు..మీరెక్కడున్నా ధైర్యంగా ప్రజల్లోకి రండి ప్రజలకు కూడా కాస్త ధైర్యం చెప్పండి. రాష్ట్ర మంత్రి గారిని ప్రజలు వేడుకుంటున్నారు.

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రంతో పాటు చాలా రాష్ర్టాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాళ్‌, జమ్మూకశ్మీర్‌ సహా దాదాపుగా రాష్ట్రాలన్నీ విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. ఐపీఎల్ మ్యాచులు కూడా వాయిదా పడ్డాయి. ప్రధాని సార్క్ దేశాల సమావేశం కూడా ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు చేపట్టారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా స్కూల్స్ మూసి వేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. రూ.500 కోట్లను కరోనా వ్యాప్తి నివారణకు కేటాయించారు.

ఇంతవరకూ అంతా బాగానే ఉంది..ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతుబట్టని విషయం ఏంటంటే దేశ ప్రధాని సహా రాష్ట్రాల ఇన్ని ముఖ్యమంత్రులు కరోనాపై స్పందించినా మన ముఖ్యమంత్రి మాత్రం ఎందుకు స్పందించడంలేదని నిన్నటి వరకూ అనుకున్నారు. కానీ మన సీఎం గారు మీడియా ముందుకొచ్చి ఆందోళన అవసరంలేదు బ్లీచింగ్ పౌడర్, పారసిటమాల్ ఉంటే చాలు అదే పోతుంది అని ప్రజలకు యెనలేని ధైర్యం అందించారు. ఇదంతా అలా ఉంచుదాం..

అసలింతకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఏంచేస్తున్నారు? ఇలాంటి వెలకట్టలేని ప్రశ్నలు ప్రజల మెదళ్ళని తొలుస్తూనే ఉన్నాయి..కొంతమందికి మాత్రం మంత్రిగారు మొన్నామద్యన ఒక మున్సిపల్ కార్పోరేషన్ కు 5గురు డిప్యుటీ మేయర్ అభ్యర్దులను నియమించామని ఇది దేశంలోనే ప్రధమం అని చెప్పినట్టు గుర్తు..తర్వాత మళ్ళీ ఇంతవరకూ అమాత్యులవారి అయిపు, జాడ లేదు. ఇంతకీ మంత్రిగారికి ఏమైంది..ముఖ్యమంత్రి గారే మెడిసిన్ చెప్పారు కదా ఇంకా నాకేం పని అనుకున్నారా? లేదా కరోనా భయంతో స్వయం నిర్భందంలోకి వెళ్ళిపోయారా? అని ప్రజలు గుబులు పడుతున్నారు.