English | Telugu
నాగబాబు ట్వీట్లకు పెరుగుతున్న ఫాలోయింగ్!
Updated : Mar 17, 2020
ఊరంతా వడ్లు ఎండబెట్టుకుంటుంటే, నక్క మాత్రం తోక ఎండబెట్టుకుందని సామెత. నాగబాబు శూన్య మాసం లో మాంఛి ముహూర్తం చూసి మరీ స్టార్ట్ చేసిన పొలిటికల్ ట్వీట్లు అన్నీ, జెట్ స్పీడ్ లో బూమరాంగ్ అవుతున్నాయి. ఆయన ఇలా ట్వీట్లు పెట్టడం ఆలస్యం, అలా వేడి వేడిగా నెటిజన్లు మాంఛి టైమింగ్ తో మరీ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన ప్రజల ఆలోచనలను ప్రతిబింబించేలా పెట్టిన ట్వీట్ కూ నెటిజెన్లూ అంటే ఫాస్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చేసారు.
"Antything,any belief which is devoid of logic,reason,rational,evidence,witness,,. That is faith.so all the faiths and religions are same." అంటూ ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ లో కంటెంట్ చూడటం మానేసి మరీ నెటిజనం, ఆయన ఆంగ్ల భాషా పరిజ్ఞానం మీద సెటైర్లు వేయడం మొదలెట్టారు.
"బుస్సన్న, ఈ ఇంగ్లీష్ అంత నువ్వే ట్వీట్ చేశావా.మీవి అంత ఎండాకాలం లో వానాకాలం చదువులు అని ఫ్యూజ్ లేని పవర్ స్టార్ అన్నట్టు గుర్తు ," అంటూ ఒక నెటిజనుడు విసిరిన సెటైర్ బాగా ట్రోల్ అవుతోంది. నిజానికి, జబర్దస్త్ షో చేసినంత కాలం, నాగబాబు కు టైమింగ్ బాగా కలిసొచ్చింది. ఇప్పుడా షో నుంచి బయటకు వచ్చిన తర్వాత , కాస్తంత తీరిక చేసుకుని మరీ తమ్ముడు పవన్ కళ్యాణ్ జన సేన కోసం , ట్విట్టర్ వేదికగా నాగబాబు విపరీతంగా శ్రమిస్తున్నాడు. ఒక అంచనా ప్రకారం, ఆర్ జీ వీ ట్వీట్ల తర్వాత, ఇప్పుడు నాగబాబు ట్విట్టర్ పేజీ కె ఎక్కువ ఫాలోయింగ్ ఉందట. కానీ, ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందని మాత్రం నాగబాబు ఊహించలేదు.