English | Telugu

క‌రోనా తెలుగుజనాలకు కామెడి అయిపోయిందా?

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కామెడీ అయిపోయింది. అవును నిజంగానే కరోనా వైరస్ నిజం కామెడీగానే చూస్తున్నారు. మరి దాని తీవ్రత అర్థం అయిందో అర్థం కాలేదో తెలియదు గానీ సోషల్ మీడియాలో కరోనా వైరస్ మీద కామెడీ చేస్తూ జనాల్లోకి దాని సీరియస్ నెస్ వెళ్లకుండా కొందరు వెటకారంగా పోస్ట్ లు పెడుత‌న్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆరు, తెలంగాణాలో 27కు క‌రోనా బాధితుల సంఖ్య చేరింది. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకపక్క జనాలు బయటకు వెళ్ళవద్దని ప్రభుత్వాలు అన్ని విధాలుగా చెప్తున్నా బయటకు వెళ్తే ప్రాణాలు పోతాయి అని చెప్తున్నా సరే ఎవరూ కూడా మాట వినే పరిస్థితి కనపడటం లేదు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళ చేస్తున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మానకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారు.

ఎవరిని ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్తున్నా పొద్దున్నే వాకింగ్ మానడం లేదు. పిల్లలు ఆడుకోవడానికి మానట్లేదు. అలాగే ఆ పార్టీ, ఈ పార్టీ, కిట్టి పార్టీ లు అంటూ బయటకు వెళ్లడం. చిన్న చిన్న ఫంక్షన్ లో కూడా. అర్ధం చేసుకునే పరిస్థితిలో ఆంధ్ర‌తెలంగాణా జనాలు లేర‌ని బ‌య‌టి దృశ్యాలు చూస్తే కనిపిస్తోంది.

కరోనా వైరస్ గురించి ఇలాగే ఇటలీ తక్కువ అంచనా వేసి ఇప్పుడు నానా సంక నాకుతుంది. ఒకపక్కన ఇటలీలో వేలాదిమంది చచ్చిపోతున్నా ఇక్కడ మాత్రం ఇతరులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించటం నిజంగా బాధాకరం.

లాక్ డౌన్ ను సీరియస్ గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. లాక్ డౌన్ ను పట్టించుకోకుండా ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే "చాలా మంది లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ సూచనలను సీరియస్ గా ఫాలో కండి. నిబంధనలను కఠినంగా అమలయ్యేగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను" అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుంది. ఎవరైనా బయట తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలొో మృతుల సంఖ్య 2 శాతంగా ఉంది. దయచేసి మీ జీవితాలను కాపాడుకోండి..మీ కుటుంబాన్ని రక్షించుకోండి.