English | Telugu

రోడ్డు మీద క‌నిపిస్తే వెహిక‌ల్ సీజ్ చేస్తానంటున్న డీజీపీ

సోమవారం ఉదయం ప్రజలు ఎలాంటి భ‌యం లేకుండా, ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌ల్ని పట్టించుకోకుండా కనపడటంతో పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. లాక్ డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు రోడ్లపైకి వాహనాలు రాకుండా ఉండాలని అత్యవసరమైతేనే రావాలని సూచిస్తున్నారు.

కారణం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు. రోడ్లపై వచ్చేందుకు బలమైన కారణం ఉండాలి. బైక్ మీద ప్రయాణించే వారు ఇద్దరు మాత్రమే వెళ్లాలి. కారులో వెళ్లాలనుకుంటే ఇద్దరికే పర్మిషన్. అత్యవసర షాపులు తప్ప అన్నీ బంద్. ప్రజలు సహకరించకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

సాయంత్రం 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదని డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సూచించారు. వచ్చే 10-15రోజులు అత్యంత కీలకమైనవి. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చ‌రించారు. తెలంగాణలో ముప్పైకి పైగా కరోనా కేసులునమోదు కావడంతో సర్వత్రా అలర్ట్ ప్రకటించారు.