English | Telugu

రేపు ఉదయం నుంచి 24గంటల పాటు తెలంగాణ బంద్

* పక్క రాష్ట్రాల బస్సులకూ అనుమతి లేదు: ముఖ్యమంత్రి
* సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులు
* మెట్రో రైలు సర్వీసులు కూడా రేపు ఉండవు
* విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా డాక్టర్లను సంప్రదించాలి: సి ఎం



విదేశాల నుంచి వచ్చిన వారు స్థానిక హాస్పిటల్ లో కానీ,పోలీస్ స్టేషన్ లలో స్వచ్ఛందంగా వారి వివరాలు వెల్లడించాలని కె సి ఆర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇలా చేయడం వల్ల వైరస్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు..ఇది మన సామాజిక బాధ్యతగా చేయాలన్నారు ముఖ్యమంత్రి.
జ్వరం,దగ్గు,జలుబు ఉన్న వాళ్ళు డాక్టర్ ను సంప్రదించండి..మీరు సమాచారం ఇస్తే చాలు మేమె హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాం..విదేశాల్లో నుంచి వచ్చిన వారు ప్రతి ఒక్కరు స్వచ్ఛద్దంగా రిపోర్ట్ చేయండి..డాక్టర్లని సంప్రదించండి..రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇంట్లోనే వుండండని కూడా కె సి ఆర్ సూచించారు. తెలంగాణ మొత్తం ఆర్ టీ సి బస్సులు నిలిపివేస్తున్నాం..తప్పనిసరి పరిస్థితిలో డిపోలో 5 బస్సులు పెడతాం...వేరే రాష్ట్రాల బస్సులను కూడా తెలంగాణలోకి రానివ్వమనీ చెప్పారు ముఖ్యమంత్రి. ..మెట్రో ట్రైన్ లు కూడా బంద్...ఎమర్జెన్సీ కోసం 5 మెట్రో ట్రైన్ లు అందుబాటులో ఉంటాయి..షాప్స్,మాల్స్ అన్ని మొత్తం బంద్ చేయాలనీ సి ఎం ఆదేశించారు.