English | Telugu

జీతాల కోసం తెలంగాణాలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్...!

తెలంగాణా, ఆంద్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయేలా కనిపిస్తున్నాయి. దీనికి కారణం గత 5 నెలలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటమే. పెరిగిన ధరలు, పన్నులకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెంచాలని, ఇందుకోసం ఎంఓయూలో చేర్చిన నిబంధనలను కూడా సడలించాలని డిమాండ్ చేస్తూ... రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్టు ‘తెలంగాణ ప్రైవేటు హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్’ ప్రకటించింది. వీరికి కార్పొరేటు ఆస్పత్రులు కూడా తమకు మద్దతు తెలుపుతున్నాయన్నారు. బకాయిలు రాకపోవడంతో నర్సింగ్‌హోమ్‌లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. విద్యుత్, నీరు తదితర బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది’ అని సంఘం అధ్యక్షుడు డాక్టర్ సురేశ్‌గౌడ్ చెప్పారు.