English | Telugu

వలసలు వైసీపీలోకి - మేలు టీడీపీకి... క్లారిటీ వస్తోందా?

గత కొన్ని రోజులుగా వైసీపీలో కి భారీ స్థాయిలో టిడిపి నాయకులు క్యూ కడుతున్నారు.. వాస్తవంగా అయితే ఇది టిడిపికి కొంత ఇబ్బంది కర పరిణమామే.. అయితే టిడిపి ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తోంది..ఈ వలసల వల్ల అసలు ఏదీ నకిలీ ఏదీ అనేది త్వరగా తెలిసి పోతుంది అంటున్నారు టిడిపి నాయకులు...సొంత పార్టీలోనే ఉంటూ పక్క పార్టీ అయిన వైసీపీతో టచ్ లో ఉండేకంటే పార్టీ మారితే తమ దగ్గర అసలు సరకు బయట పడుతుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అంటి పెట్టుకుని ఎవరు ఉంటారు అనేది ఒక క్లారిటీ వస్తుందంటున్నారు....ఇప్పటికే కొంత మంది ఎంఎ‌ల్ఏలు వైసీపీతో టచ్ లో ఉన్నారు .. ముగ్గురు ఆల్రడీ సీఎం జగన్ ను కలిసారు..అయినా కూడా టీడిపి అంతా మన మంచికే అన్నట్టుగా వ్యవహరిస్తోంది.......

వలసలు కొనసాగితే ఉన్నవారితో ఈ నాలుగేళ్లు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చే అనే ఆలోచనలో టిడిపి వర్గాలున్నాయి......ఎంఎల్ఏలు జారిపోయినా ద్వీతీయ శ‌్రేణీ నాయకులు చేయి దాటినా తమ పక్కన ఉన్న వారితోనే రాజకీయం చేయచ్చు అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం....ఇప్పుడు వైసీపీలో కి నేతలు క్యూ కట్టినా వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించడం కష్టమవుతుంది అనే ఆలోచనలో టిడిపి ఉంది...నియోజక వర్గాల పునర్ వ్యవస‌్తీకరణ లేదు కాబట్టి వచ్చిన వారందరికి సీట్లు ఇవ్వడం కష్టమనే ఆలోచన టిడిపిది....దీంతో ఎంత మంది వెళ్లినా అసంత్రుప్తి ఖాయం అనే ఆలోచనలో టిడిపి వర్గాలున్నాయి.....అయితే ప్రస్తుతం టీడిపి పరిస్థితి స్థానిక ఎన్నికలను సజావుగా ఎదుర్కోవడం పైనే ఆధారపడి ఉంది..తర్వాత వలసలపై ద్రుష్టి పెట్టనుంది టిడిపి.