English | Telugu
ఈ నటి చావుకి అందాన్ని పెంచే టాబ్లెట్స్ కారణమా! టాబ్లెట్స్ ని గుర్తించిన పోలీసులు
Updated : Jun 30, 2025
'కాంటా లగా'(Kaanta laga)అనే వీడియో ఆల్బమ్ తో ఓవర్ నైట్ దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకున్న పాప్ సింగర్ 'షెఫాలీ జరీవాలా'(Shefali jariwala). హిందీలో పలు సినిమాల్లో కూడా నటించిన షెఫాలీ తెలుగులో 'ఐతే ఏంటి' అనే సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో చేసింది. రెండు రోజుల క్రితం పెషాలి హఠాన్మరణం చెందింది. గుండెపోటుకు గురవ్వడంతోనే ఆమె మరణించినట్టుగా వార్తలు వచ్చినా, ఆమె మరణానికి 'యాంటీ ఏజ్' చికిత్స కారణమనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతుంది.
రీసెంట్ గా పోలీసులు షెఫాలీ ఇంటిని తనిఖీ చెయ్యగా రెండు బాక్సుల యాంటీ ఏజింగ్, స్కిన్ గ్లో టాబ్లెట్స్ ని గుర్తించారు. దీంతో ఆమె యాంటీ ఏజింగ్ కి సంబంధించిన ఇంజక్షన్స్, ఔషదాలు వాడుతున్నట్టుగా నిర్దారణకి వచ్చారు. ఈ విషయంలో పోలీసులు మాట్లాడుతూ పెషాలి మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తున్నాం. పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఖాళీ కడుపుతో యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ తీసుకోవడంతోనే షెఫాలీ కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యి మరణించిందనే వార్త ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తుంది.
2004లో మీట్ బ్రదర్స్‌కు చెందిన సంగీతకారుడు హర్మీత్ సింగ్‌తో షెఫాలీ వివాహం జరిగింది. ఆతర్వాత మనస్పర్థలతో 2009లో ఆ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. తదనంతరం 2015లో నటుడు 'పరాగ్ త్యాగి' ని వివాహం చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ షెఫాలీ స్వస్థలం.
