English | Telugu

క‌రోనాను టెస్ట్‌ క్రికెట్‌తో పోల్చిన టెండూల్క‌ర్‌

భారత దేశంలో ఇప్పటికే 294 మందికి కరోనా సోకగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. శ‌ర‌వేగంతో విస్త‌రిస్తున్న క‌రోనాను అడ్డుకోవ‌డానికి టెస్టు క్రికెట్ మ్యాచ్ త‌ర‌హాలో సిద్ధం కావాల‌ని స‌చిన్ అంటున్నారు. పిచ్‌ పరిస్థితులను, బౌలర్‌ శైలిని మనం అర్థం చేసుకుని సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేయాలి. ఇక్కడ అత్యంత రక్షణాత్మకంగా ఆడటం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత ప్రపంచానికి కావాల్సిందే ఓర్పు. కరోనాపై మనల్ని రక్షించుకోవాలంటే ఎంతో ఓపిక అవసరం' అని సచిన్‌ వివరించారు. ఈ పోరులో ప్రజలందరికీ సహనం, సమష్టితత్వం, అప్రమత్తత అవసరమని సచిన్‌ తెలిపారు.

వైరస్‌ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. 'జనతా కర్ఫ్యూ'కు అందరూ సహకరించాలని కోరారు. అంతా కూడా స్వీయ నిర్భందాన్ని పాటించాలన్నారు.

అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 'సేఫ్‌ హ్యాండ్స్‌' చాలెంజ్‌ను సచిన్ స్వీకరించారు. చాలెంజ్‌లో భాగంగా తన చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దాదాపు 20 సెకండ్లు సచిన్ చేతులు శుభ్రం చేసుకున్నారు.