English | Telugu

రమేష్ గాంధీనా..భరత్ రెడ్డా!.. సజ్జల రామకృష్ణా రెడ్డే డిసైడింగ్ ఫ్యాక్టర్

రమేష్ గాంధీనా..భరత్ రెడ్డా ! గుంటూరు వై ఎస్ ఆర్ సి పి లో మేయర్ పదవికి పోటీ పడుతున్న ఆశావహులు ... సజ్జల రామకృష్ణా రెడ్డే డిసైడింగ్ ఫ్యాక్టర్

గుంటూరు నగర పాలక సంస్థ రాజకీయం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారింది. అధికార వై ఎస్ ఆర్ సి పీ, విపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ కన్నా, అధికార పార్టీ లోనే అంతర్గత పోరు చాలా బలంగా కనిస్పిస్తోంది. గుంటూరు నగర వై ఎస్ ఆర్ సి పీ అధ్యక్షునిగా ఉన్న పాదర్తి రమేష్ గాంధీ, నిజానికి మేయర్ పదవి ఆశావాహునిగా ఎప్పటి నుంచో తన ప్రయత్నాలు తానూ చేసుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు జనరల్ కేటగిరీ లో ఉండటం వల్ల , వైశ్య సామజిక వర్గానికి చెందిన పాదర్తి రమేష్ గాంధీ, తన ప్రత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి వెంకట రమణ తో పాటు, గుంటూరు వన్ ఎం ఎల్ ఏ ముస్తఫా, ఇంకా గుంటూరు-పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యేసు రత్నం ల మద్దతు ఉన్న రమేష్ గాంధీ అభ్యర్థిత్వంపై , జిల్లా ఇంచార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు కూడాపాజిటివ్ గా ఉండటం గాంధీ కి ప్లస్ పాయింట్ అయితే, పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి ని ఆశ్రయించిన స్విమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు తానూ చేస్తున్నారు. తనకు గానీ, వీలు కాని పక్షం లో తన భార్య శిరీష కు గానీ మేయర్ స్థానానికి పోటీ చేసే అవకాశం కల్పించాలని భరత్ రెడ్డి కోరుతున్నారు. నిజానికి 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న పాదర్తి రమేష్ గాంధీ తో పోలిస్తే, భరత్ రెడ్డి కి ఉన్న రాజకీయ నేపధ్యం అసలు ఏ మాత్రం పరిగణన లోకి రాదనేది గుంటూరు వై ఎస్ ఆర్ సి పీ వర్గాల వాదన. అయితే, సజ్జల తో తనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా , భరత్ రెడ్డి మాత్రం చాలా ధీమా గా ఉన్నారు. ఇక, బొత్స సత్యనారాయణ అనుయాయునిగా ముద్ర పడిన కావేటి మనోహర్ నాయుడు కూడా మేయర్ పదవి ఆశావహుల్లో ఉన్నారు. ఇలా, ప్రస్తుతానికి మూడు గ్రూపులు, ఆరు అభిప్రాయాలు గా నడుస్తున్న వై ఎస్ ఆర్ సి పీ రాజకీయం ఇలాఉంటే, విపక్ష తెలుగు దేశం మాత్రం కార్పొరేటర్ అభ్యర్థులను వెతుక్కునే పని లో పడింది.

నిజానికి, 2005 ఎన్నికల తర్వాత 15 ఏళ్ల పాటు గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. 2012లో గుంటూరు నగర పాలకసంస్థలో చుట్టూ పదిగ్రామాలను విలీనం చేశారు. 2014లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గుంటూరు కార్పొరేషన్‌కు ఎన్నిక లు జరగలేదు. అప్పట్లో వార్డుల పునర్‌ విభజన సక్రమంగా జరగలేదని పలువురు వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి గుంటూరు నగరపాలక సంస్థకు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 2020లో ఎన్నికల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ కావడం, రిజర్వేషన్లు ఖరారుకావడంతో ఎన్నికలకు కార్పొరేషన్‌ సన్నద్ధం అయింది.1994 నుంచి ఇప్పటి వరకు మూడు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లోవరుసగా రెండుపర్యాయాలు తెలు గుదేశం పార్టీ మేయర్‌ సీటును గెలుచుకుంది. 2005 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి జరిగే నగరపాలకసంస్థ ఎన్నిక ల్లో మేయర్‌ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.

2005లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 31కార్పొరేటర్‌ స్థానాలను గెలుపొంది మేయర్‌ పదవినికైవసం చేసుకుంది. అయితే అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ మంత్రి గా తన కుమారుడు కన్నా నాగరాజును మేయ ర్‌గా చేయాలని, అప్పటి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తన సోదరుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ కుమారుడు మోహన్‌ సాయికృష్ణను మేయర్‌గా చేయాలని పట్టుపట్టారు. దీం తో ఈ వ్యవహారం కాస్తా హైదరాబాద్‌కు మార డం,అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జోక్యం చేసుకొని చేరో రెండున్నర సంవత్సరాలు మేయ ర్‌ స్థానాన్ని అధిష్టించాలని ఆదేశించారు. తొలు త 2005 అక్టోబర్‌ 5న నగర మేయర్‌గా కన్నా నాగరాజు, డిప్యూటీ మేయర్‌గా తాడిశెట్టి మురళీమోహన్‌లు బాధ్యతలు చేపట్టారు. అప్పటి ఒప్పందం ప్రకారం 2008లో మేయర్‌, డిప్యూలీ మేయర్‌ పదవులకు వారు రాజీనామా చేశారు. దీంతో 2008 మే 3న నగర మేయర్‌గా రాయపాటి మోహన్‌సాయికృష్ణ, డిప్యూటీ మేయర్‌గా షేక్‌ గౌస్‌లు బాధ్యతలు చేపట్టారు. అయితే రెం డున్నర సంవత్సరాల పాటు వీరిద్దరు మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా కొనసాగి 2010 సెప్టెంబర్‌ 29న పదవీ కాలం ముగిసింది.