English | Telugu

' లక్ష్మణ రేఖ ' దాటితే, వాహనాలు స్వాధీనం: డి.జి.పి . గౌతమ్ సవాంగ్

కరొనా వైరస్ వ్యాప్తి, తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ డి జి పి గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుందనీ, ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలనీ ఆయన సూచించారు. వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలెవరూ రోడ్ల పైకి రావద్దనీ, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలనీ కోరారు.
భావి సమాజంకోసం పోలీసులు ఆంక్షల అమలులో ఖచ్చితంగా వ్యవహరిస్తారనీ, అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందనీ, ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామనీ, ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు..ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారనీ కూడా డి జి పి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. సీజ్ చేసిన వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తరువాత మాత్రమే రిలీజ్ చేస్తామన్నారు. ప్రైవేట్ వాహనాలను నిత్యావసర వస్తువులు/అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామని కూడా డి జి పి స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు, చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తారనీ, అందుకు సహకరించాలని కూడా డి జి పి గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు.