English | Telugu

బీజేపీ భేటీలో పీకే, అసలేం జరుగుతుంది?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో జరిగిన భేటీకి అపోజిషన్ పార్టీ లీడర్ వై యస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరవడం చర్చనీయాంశం అయింది. బీజేపీకి జాతీయ స్థాయిలో వ్యూహకర్తగా నియమితుడయిన ప్రశాంత్ కిషోర్ ఈ భేటీకి హాజరై... రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై వివరించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పొత్తుకు లైన్ క్లియర్ చేశారు అని ప్రచారం జరుగుతుంది. అయితే, పీకే కి చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. తన ట్విట్టర్ అకౌంట్లో ఓ టీవీ ఛానల్ క్లిప్ను జతచేస్తూ మరీ...`పూర్తిగా అవాస్తవ కథనం. అసత్యకథనాలను ప్రచారం చేసేందుకు దురుద్దేశపూరితంగా చేస్తున్న ప్రచారం ఇది. ఇలాంటి ప్రచారం గురించి వదిలేయండి. ఎందుకంటే ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలోనే లేరు` అంటూ తేల్చిచెప్పింది. అంతేకాకుండా బీజేపీ జాతీయ స్థాయి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించడం కూడా పూర్తిగా అబద్దమని పేర్కొంది. ఇదిలా ఉంటె, రాజకీయ విశ్లేషకులు మాత్రం బీజేపీ కి, వైకాపా కి పోతుకుదుర్చే పనిలో ఉన్నారని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.