English | Telugu
ఏడుకొండలవాడే దిక్కన్న పరిమళ్ నత్వానీ
Updated : Mar 19, 2020
కరొనపై ట్వీట్ చేసిన వై ఎస్ ఆర్ సి పి రాజ్యసభ సభ్యడు
ఎంత లావు రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ అయినా,దానితో పాటు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విజయసాయి రెడ్డి ద్వారా హఠాత్తుగా ఆత్మీయుడైపోయినా , పరిమళ్ నత్వానీ మాత్రం బాగా తత్త్వం, దైవ చింతన, ఒంట బట్టించుకున్న పెద్ద మనిషి అనిపించుకున్నారు, తన తాజా ట్వీట్ ద్వారా. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భీతిని దాటించి, మానవ జాతిని రక్షించగలిగేది తిరుమల వెంకన్న పాదపద్మములే నంటూ, శ్రీవారి శరణాగతి మాత్రమే ఈ వ్యాధి నుంచి బయటపడే ఉత్తమ మార్గమని ట్విట్టర్ లో ప్రకటించారు. శ్రీ వారి దర్శనం తో పులకించిపోయానంటూ, శ్రీవారి దర్శనం తాలూకు అపురూపమైన వీడియో ని కూడా ఆయన తన ట్వీట్ కు జత చేశారు. కొసమెరుపేమిటంటే, ఈ ట్వీట్ కు అయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని, విజయసాయి రెడ్డి ని కూడా ట్యాగ్ చేశారు.