English | Telugu

ఓజి రాయలసీమ రిలీజ్ హక్కులు ఎవరివో తెలుసా! పేరు తెలిస్తే షాక్ అవుతారు 

ఓజి రాయలసీమ రిలీజ్ హక్కులు ఎవరివో తెలుసా! పేరు తెలిస్తే షాక్ అవుతారు 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీస్ లో 'ఓజి'(Og)ఒకటి. గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఓజి కి సాహూ ఫేమ్ 'సుజిత్'(Sujeeth)దర్శకత్వం వహిస్తుండగా, 'ఆర్ఆర్ఆర్' మూవీ ఫేమ్ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ తో 'ఓజి'పై పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

ఈ మూవీ రిలీజ్ హక్కులని పలు ఏరియాల వారీగా పొందటానికి అగ్ర నిర్మాతలు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. సినీ సర్కిల్స్ ల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఓజి సీడెడ్(రాయలసీమ) రైట్స్ కోసం ప్రతిష్టాత్మక  సితార బ్యానర్ అధినేత  నాగవంశీ  భారీ మొత్తంలో ఇచ్చి తన సొంతం చేసుకున్నట్టుగా టాక్  వినపడుతుంది. పవన్ కళ్యాణ్ కి  నాగవంశీ అత్యంత సన్నిహితుడు. పవన్ తో భీమ్లా నాయక్ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా, 
గత ఎన్నికల్లో పవన్ గెలుపు కోరుతు పిఠాపురంలో ప్రచారం కూడా చేసాడు. మిగతా ఏపీ మొత్తానికి  మరో టాప్ నిర్మాత 80 కోట్ల రూపాయల దాకా చెల్లించి హక్కులని పొందినట్టుగా తెలుస్తుంది. 

ఓజి లో ప్రియాంక మోహన్(Priyanka MOhan)హీరోయిన్ కాగా, ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడుగా చేస్తున్నాడు. శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్(Taman)మ్యూజిక్ డైరెక్టర్.

 

 

ఓజి రాయలసీమ రిలీజ్ హక్కులు ఎవరివో తెలుసా! పేరు తెలిస్తే షాక్ అవుతారు