English | Telugu

ఉరికి వేలాడిన నిర్భ‌య దోషులు

చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అనే విషయం మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీశారు. నిర్భయ దోషులైన ముఖేశ్‌ సింగ్‌(32), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌(31), పవన్‌ గుప్తా(25) లను తిహార్ జైలులో కట్టుదిట్టమైన సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య సాగిన ఉరిశిక్ష ప్రక్రియ అమలు చేశారు. ఉదయం 4 గంటలకు నలుగురు దోషులకు అల్పహారాం అందించారు. ఉరికంబం వద్ద 40 మంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దోషి వెంట 12 మంది సిబ్బంది ఉన్నారు. దోషులకు ఉరిశిక్షకు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలు నెంబర్ 3లో నలుగురిని ఉరి తీశారు. అయితే ఉరిశిక్షకు ముందు వినయ్ శర్మ బోరున విలపించాడు. ఉదయం 5:30 గంటలకు నలుగురు దోషులకు ఉరి తీశారు తలారి పవన్.

అయితే ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నలుగురు దోషులు అనేక ప్రయత్నాలు చేశారు. వివిధ కోర్టుల్లో వివిధ రకాల పిటిషన్లు దాఖలు చేసి శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ,

ఢిల్లీ హైకోర్టులో నిర్భయ దోషుల పిటిషన్‌పై గురువారం అర్థరాత్రి వరకు వాడీవేడీ వాదనలు జరిగాయి. గురువారం రాత్రి 11.30ల వరకు విచారణ సాగింది. దీంతో హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది.

సౌత్ ఢిల్లీలో 2012 డిసెంబర్ 12న కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయను గ్యాంగ్ రేప్ చేశారు. నిర్భయను తీవ్రంగా గాయపరిచారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నిర్భయ.. చివరికి ప్రాణం వదిలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొత్తం ఆరుగురు దోషులు కాగా.. ఒకడు జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్ కావడంతో జువైనల్ జైల్లో శిక్ష అనుభవించాడు.

20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో నలుగురు దోషులకు ఉరితీశారు.

నలుగురు దోషులను ఉరి తీసినట్లు తిహార్ జైలు డైరెక్టరు జనరల్ సందీప్ గోయెల్ ధ్రువీకరించారు. ఉదయం 6.00 గంటలు నలుగురు దోషులు మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. నలుగురు దోషుల మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వ‌హించారు.