English | Telugu
ఉత్తమ్ ఒళ్లు దగ్గర పెట్టుకో- కేసీఆర్
Updated : Oct 9, 2016
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారికి స్వర్ణకిరీటాన్ని బహూకరించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఇష్టారీతిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని ఉత్తమ్ మాట్లాడుతున్నాడు..ఇలా అనేటపుడు ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏడాది కిందటే సీఎస్‌తో ప్రత్యేక కమిటీని వేశాం. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసకున్నాం. భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను కూడా దృష్టిలో ఉంచుకుని జిల్లాలను రూపొందించాం. జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెసోళ్లకే ఏకాభిప్రాయం లేదని..అందుకే ఒక్కొక్కరు ఒక్కో జిల్లా కావాలని డిమాండ్ చేస్తున్నార. తీరా వాళ్లు అడిగినవన్నీ ఇచ్చేసరికి గుండెలు బాదుకుంటున్నరని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకుంటోన్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రతి దానికి అడ్డుచెబుతున్నారని దుయ్యబట్టారు.