English | Telugu

బీహార్ లో ఎన్డీయే హవా.. 121 స్థానాల్లో ముందంజ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందిన ఆధిక్యతలను బట్టి ఎన్డీయే ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే ప్రస్తుతం ఎన్డీయే కూటమి గెలుపుబాటలో ఉంది.

ఆ కూటమిఅభ్యర్థులు 123 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతుండగా, ఇండియా కూటమి అభ్యర్థులు 71 స్థానాలలో ఆధిక్యత కనబరుస్తున్నారు. మహువా స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ వెనుకంజలో ఉన్నారు.