English | Telugu
జూబ్లీ బైపోల్.. ఆధిక్యంలో నవీన్ యాదవ్
Updated : Nov 13, 2025
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సాగుతోంది. రౌండ్ రౌండ్ కూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత పెరుగుతూ వస్తున్నది. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి కేవలం 62 ఓట్ల ఆధిక్యతతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. రెండో రౌండ్ లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు.
ఈ రౌండ్ పూర్తయ్యే సరికి ఆయన ఆధిక్యత మూడు వేల పై చిలుకుకు చేరింది. మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ రౌండ్ లో కూడా నవీన్ యాదవ్ ఆధిక్యత కనబరుస్తున్నారు.