English | Telugu
ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ మెజారిటీ 12 వేలకు పైనే
Updated : Nov 14, 2025
జూబ్లీ బైపోల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత పెరుగుతూ వస్తున్నది. ఇప్పటి వరకూ ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తికాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 12 651 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు. బీజేపీ ఇక్కడ మూడో స్థానానికే పరిమితమైంది. ఇప్పటివరకూ పూర్తయిన ఐదు రౌంట్ల ఓట్ల లెక్కింపులోనూ ప్రతి రౌండ్ లోనూ అనిల్ యాదవ్ కుఆధిక్యత వచ్చింది. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థికి 42 వేల 126 వోట్లు, మాగంటి సునీతకు 33 వేల 978 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 6, 856 ఓట్లు వచ్చాయి.