English | Telugu
NPR రద్దు చేయకపోతే స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తాం!
Updated : Mar 9, 2020
24 గంటల్లో NPR రద్దు చేస్తూ ప్రకటన చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో తమ అభ్యర్థులను నిలుపుతామంటూ C.M. జగన్ కి NPR,CAA వ్యతిరేక అలయన్స్ అల్టిమేటం ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా జరుగుతున్న NPR,CAA,MRC వ్యతిరేక ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో NPR ను తాత్కాలికంగా నిలిపి వేసినట్టు ప్రకటించడాన్ని స్వాగతించే లోపులోనే జిల్లా కలెక్టర్ ల ద్వారా ఏప్రిల్ ఒకటి నుండి NPR వివరాల సేకరణకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం తమకు ఓట్లేసిన ప్రజలను మోసగించడమేనని. ముస్లిం సంఘలు మండి పడుతున్నాయి.
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పి కేరళ వలె NPR ను శాశ్వత ప్రాతిపదికపై నిలుపుదల చేయాలని విజయవాడలో జరిగిన Alliance Against NRC NPR CAA సంఘాల సమావేశం డిమాండ్ చేసింది. అలయన్స్ రాష్ట్ర కన్వీనర్ షబ్బీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ సమావేశంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ లకు అతీతంగా అభ్యర్థులను నిలబెట్టి వారు గెలుపు కు ప్రజాసంఘాలు కృషి చేయాలని నిర్ణయించారు.
NPR ను 2010 ప్రశ్నలతో చేసినా ప్రమాదమేనని అది NRC కి తొలిమెట్టు అని కేంద్రం స్పష్టంగా చెప్పిన నేపధ్యంలో NRC కి వ్యతిరేకమని ప్రకటించిన ప్రభుత్వం NPR ను పూర్తిగా నిలుపుదలచేసి తమ విశ్వసనీయతను చాటుకోవాలన్నారు.
తక్షణమే రాష్ట్రంలో NPR ,CAA,NRC లను అమలు చేయబోమని అసెంబ్లీ తీర్మానం చేయాలని, తీర్మానం చేసేంతవరకుఈ పోరాటం ఆగదని ప్రకటించారు. లేకపోతే రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన వారిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మిగిలిపోతారని ఈ సమావేశం అభిప్రాయపడింది.
ముఖ్యమంత్రి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటన చేశారని, ఎన్నికలే లేకపోతే ఈ ప్రకటనకూడా వచ్చేది కాదని ఈ సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు.
ఈప్రభుత్వం అసెంబ్లీ లో NPR,NRC,CAA లను పూర్తిగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని,
సెప్టెంబరు లోపు ఎప్పుడుNPR నిర్వహించడానికి ప్రయత్నించినా ప్రజలు బహిష్కరించాలని సమావేశం పిలుపు నిచ్చింది.