English | Telugu

హైదరాబాద్ అభివృద్ధికి భారీ బ‌డ్జెట్‌!

రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు. అవినీతి లేకుండానే టీఎస్‌ బీపాస్‌ ద్వారా పట్టణాల్లోని భవనాలకు అనుమతులివ్వ‌నున్నారు. టీఎస్‌ ఐపాస్ తరహాలోనే టీఎస్‌ బీపాస్‌ను కూడా ఏప్రిల్‌ 2 నుంచి తీసుకొస్తున్నారు.

తెలంగాణా రాష్ట్రానికి ప్ర‌ధానంగా హైదరాబాద్ నుంచే ఆదాయం వ‌స్తుంది. మెర్సర్‌ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో హైద‌రాబాద్ దేశంలోనే అత్యున్నత జీవన ప్రమాణాల నగరంగా నిలిచింది.

తెలంగాణా ప్ర‌భుత్వం ఈ బడ్జెట్‌లో హైదరాబాద్ కోసం ప్ర‌త్యేకించి పది వేల కోట్ల రూపాయ‌లు కేటాయించారు.
రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ సంకల్పంగా పెట్టుకున్నారు.

త్వ‌ర‌లో మెట్రో రెండో దశ చేపట్ట‌డానికి కార్యాచ‌ర‌ణ రూపొందించారు. హైదరాబాద్‌ మెట్రోను ఎయిర్‌పోర్టు వరకు విస్తరించి.. ఐటీ కారిడార్‌కు ట్రామ్స్‌ను తీసుకురానున్నారు. హైదరాబాద్ నగరంలోని వివిధ చోట్ల 40 మల్టీ లెవల్‌ పార్కింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో పట్టణ జనాభా 44 శాతం ఉంది అందువల్లే పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్‌ మాస్టర్‌ సీవరేజ్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మిషన్‌ భగీరథ నీళ్లు అందిస్తున్నారు.