English | Telugu

నాయుడు, జగన్ కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని సూచించిన కె ఏ పాల్

* తెలంగాణా, ఆంధ్రా సి.ఎం. లకు పాల్ బంపర్ ఆఫర్
* రాజకీయాలు తర్వాత చేసుకోవచ్చని వారిద్దరికీ హితవు
* ఎవరి విశ్వాసం ప్రకారం వారు దేవుడిని ప్రార్ధించండి : కె ఏ పాల్
* మత మార్పిడులకు తానేమీ ప్రయత్నించటం లేదని స్పష్టం చేసిన కె ఏ పాల్
* ఛారిటీ సిటీ, చిట్టి వలసల్లోని తన భవనాలను క్వారంటైన్ సెంటర్స్ గా వినియోగించుకోవాలని ఇద్దరు సి.ఎం . లకు సూచన

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సి ఎం లకు ఆఫర్ ఇచ్చిన కె ఏ పాల్. చిట్టివలసల లోని తన పాతిక ఎకరాల భూమిలో -వంద పడకల భవనాన్ని క్వారంటైన్ సెంటర్ గా ఉపయోగించుకోవాలని కె ఏ పాల్ సూచించారు. తెలంగాణా లో ఛారిటీ సిటీ లో వెయ్యి ఎకరాలు-300 ఎకరాలలో ఉన్న భవనాన్ని కూడా క్వారంటైన్ సెంటర్ గా వినియోగించుకుని , కరోనా బాధితులకు బాసటగా నిలబడాలని కె ఏ పాల్ సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ మతస్తులైనా, వారి వారి మత విశ్వాసాల ప్రకారం దేవుని ప్రార్ధించాలని, ఎవరినీ మత మార్పిడి కోసం తానూ ఒత్తిడి చేయటం లేదనీ కె ఏ పాల్ స్పష్టం చేశారు. అమెరికా ఏడాది వ్యయం ఎంత ఉంటుందో, ఈ కరోనా దెబ్బకి అమెరికా ఆ మేరకు దాదాపు రెండు ట్రిలియన్ డాలర్లు నష్పోయిందనీ కూడా కె ఏ పాల్ చెప్పుకొచ్చారు.
తెలుగు దేశం , బీ జె పీ , కాంగ్రెస్ ప్ఫటీల నాయకులకు కూడా కె ఏ పాల్ సుద్దులు చెప్పారు. భూకంపం సమయం లో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేసిన కె ఏ పాల్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఒక 'ఏకతా భావన ' తీసుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.