English | Telugu

జూబ్లీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యతతో కాంగ్రెస్

జూబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది. అయితే బీఆర్ఎస్ కూడా హోరాహోరీ పోరాడినట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి కేవలం 62 ఓట్ల ఆధిక్యత కనబరిచిన కాంగ్రెస్ రెండో రౌండ్లో గట్టిగా పుంజుకుంది.

తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 9 వేల 926 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ కు 62 ఓట్ల ఆధిక్యత లభించింది. అయితే రెండో రౌండ్లో నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యత కనిపించడంతో ఆయన ఆధిక్యత 1,114కు పెరిగింది.