English | Telugu
బుల్లెట్ కంటే కరోనానే ఎక్కువ భయపెట్టిందట!
Updated : Mar 22, 2020
జనతా కర్ఫ్యూ సందర్భంగా హైదరాబాద్‌లో ఖాళీగా కనిపిస్తున్న రోడ్లు! నిర్మానుష్యంగా మారిన పాతబస్తీ. బుల్లెట్ కంటే కరోనానే హైదరాబాదీలకు ఎక్కువగా భయపట్టించిందట. మతకలహాలు జరిగినప్పుడు కర్ఫ్యూ వున్నా ఫైరింగ్ జరుగుతుందని తెలిసినా జనం రోడ్లమీదకు వచ్చి అల్లర్లు చేసేవారట. బుల్లెట్‌లను కూడా లెక్క చేసేవారు కాదట. అయితే కరోనా సందర్భంగా ప్రకటించిన జనతా కర్ఫ్యూ సక్సెస్ చూస్తుంటే కరోనాతో ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నారు అర్థమవుతుందంటున్నారు పోలీసులు. స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ ను అమలు చేస్తూ జనం ఎవరూ బయటికి రాలేదు.
ఆదివారం అయినా హైదరాబాద్ రద్దీగానే కనిపిస్తోంది. ఎందుకంటే హాలిడే కాబట్టి చాలా మంది షాపింగ్ కోసం చార్మినార్ వైపే ప్రయాణం చేస్తారు. పైగా రోడ్డు పైనే అతి తక్కువ ధరకు అన్ని రకాల వస్తువులు లభించే అవకాశం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో దొరుకు తుంది. అందుకే జనంతో ఓల్డ్ సిటీ రద్దీగా కనిపిస్తుంది. అయితే ఈ రోజు జనతా కర్ఫ్యూ కారణంగా రోడ్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. జనం బయటకు రావడం లేదు.
గతంలో ఎప్పుడో మతకలహాలు జరిగినప్పుడు ఇలాంటి సీన్‌యే కనిపించేది. ఇప్పడు కరోనా దెబ్బకు జనం భయపడి ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. ఎక్కడా వాహనాలు కనిపించడం లేదు. రోడ్లపై అమ్ముకునే వ్యాపారస్థులు సైతం తమ వ్యాపారాలను బంద్ చేసుకుని ఇళ్లకే పరిమితం అయ్యారంటే కరోనా భయం జనాన్ని ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
మరో వైపు ట్రాఫిక్ పోలీసులు చౌరస్తాల వద్ద ప్లేయకార్డులు పట్టుకొని కోవిడ్ 19 మహమ్మారి పై అవగాహన కలిపిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి కానీ జనం ఎక్కడ రోడ్ల మీద కనిపించడం లేదు.
ఉదయం కేవలం న్యూస్ పేపర్, ఇళ్లకు పాలు వేసే వారే రోడ్ల మీద కనిపించారు. హైదరాబాద్ మొజంజాహిమార్కెట్ కూడలి లో ట్రాఫిక్ డీసీపీ బాబురావు మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి జనతా కర్ఫ్యూ పై వాహన చోదకులు అవగాహన కలిపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్‌లు తమ విధులు నిర్వహిస్తున్నారు.
గతంలో మతకలహాలు జరిగిన సందర్భంగా కర్ఫ్యూ విధించినప్పట్టికీ జనం గ్రూప్‌లు గ్రూప్‌లుగా ఒకే సారి రోడ్లపైకి వచ్చే వారు. పోలీసు ఫైరింగ్ చేస్తారనే భయం కూడా లేకుండా వచ్చే వారు. అయితే పోలీస్ బుల్లెట్ కంటే కరోనాకే ఓల్డ్ సిటీ ప్రజలు భయపడ్డారని పోలీసులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.