English | Telugu

హ్యాట్సాఫ్ సునయన పటేల్.. ఏ కె 47 చేత పట్టిన ఆరు నెలల గర్భిణి

హ్యాట్సాఫ్ సునయన పటేల్..
ఏ కె 47 చేత పట్టిన ఆరు నెలల గర్భిణి..
ఛత్తీస్ గఢ్ అడవుల్లో మహిళా కమాండో..

నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా ..అంటూ మన తెలుగు ఆడియెన్స్ ఒక ఉత్తేజపూరిత, భావోద్వేగ మిళితమైన పాట వినేవారు కదా ! సరిగ్గా ఆ పాట కు సరిపడా భావోద్వేగాలను షేర్ చేసుకోవాలంటే, ఛత్తీస్ గఢ్ లో ఈ మహిళా పోలీసు కమాండో స్టోరీ ఏంటో మనం చదవాల్సిందే. ఆమె ఆరు నెలల గర్భిణీ. పేరు సునయన పటేల్. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్స్ లో దిట్ట గా పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం దట్టమైన అడవుల్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తోంది. ఒక పది కేజీ ల బరువుండే ఏ కె 47 తో పాటు, బ్యాక్ ప్యాక్ తో ఆమె ఆ అడవుల్లో శత్రువులను వేటాడుతున్న దృశ్యాలు చూస్తుంటే, ఒక మహిళ తలచుకుంటే, ఎంత కష్ట తరమైన పనినైనా దీక్షతో , నిబద్ధత తో పూర్తి చేయగలదు అనే దానికి నిదర్శనం గా చెప్పవచ్చు.

ఛత్తీస్ గఢ్ లోని తీవ్ర నక్సల్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వహించే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ -దంతేశ్వరి ఫైటర్స్ వింగ్ లో ఈ ఆరు నెలల గర్భిణీ సునయన పటేల్ ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆమె రెండు నెలల గర్భిణి గాఉన్న సమయం లో ఈ దంతేశ్వరి యూనిట్ లో చేరింది. అయితే , ప్రస్తుతం ఆరు నెలలు గర్భవతి కావడం వాళ్ళ ఆమెను సీనియర్ ఆఫీసర్స్ విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. కానీ, ఆమె విధి నిర్వహణ వైపే మొగ్గు చూపింది. పోలీసు శాఖ నిర్మించిన 'నాయి సుబహ్ క సూరజ్ ' అనే లఘు చిత్రం లో ఆమె కీలక పాత్ర పోషించింది కూడా. అయితే ఆమె ఆరోగ్యం పట్ల పోలీసు శాఖా ఉన్నతాధికారులు కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు. లోగడ ఒక సారి మిస్ క్యారేజ్ అయినా కారణంగా , ఆమెను ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరినట్టు, దంతెవాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ్ చెప్పారు.