English | Telugu

బ్రిటన్ నుంచి వచ్చిన జగన్‌కు ఈడీ మార్క్ స్వాగతం..

ఫ్యామిలీతో నాలుగు రోజులు బ్రిటన్‌లో ఎంజాయ్ చేసి వద్దామని వెళ్లి వచ్చిన వైసీపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు చెందిన రూ.749 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది . వీటిలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జగన్ నివాసం మరియు పార్టీ కార్యాలయమున్న లోటస్‌పాండ్‌లోని భవంతి, ఆయన సొంత మీడియా సంస్థ సాక్షి కేంద్ర కార్యాలయం అయిన సాక్షి టవర్స్, బెంగుళూరులోని వాణిజ్య సముదాయంతో సహా పలు కంపెనీల్లో జగన్, భారతీల షేర్లను ఈడీ అటాచ్ చేసింది. భారతీ సిమెంట్స్‌ ఛార్జిషీటు ఆధారంగా దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.