English | Telugu

నేనూ ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పనిచేశా.. నాక్కూడా వివరం తెలుసు: నిమ్మగడ్డ 

సీఎస్ రాసిన లేఖకు ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రత్యుత్తరం

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొత్తానికి స్పందించారు. మూడు పేజీలతో కూడిన లేఖ రాసిన రమేష్ కుమార్, తనకు చాలా విషయాలపై అవగాహనా ఉందనీ, తానూ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదనీ స్పష్టం చేశారు. చీఫ్ సెక్రెటరీ నీలం సహానీ కి రాసిన లేఖలో -కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరపలేమని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎస్ కు 3 పేజీల లేఖ రాసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతం లో రాజ్ భవన్ లో కంటే ముందు ఆర్దిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశాననీ, ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉందనీ అయన గుర్తు చేశారు.

కోరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేశారు.ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని లేఖలో సూచించిన రమేష్ కుమార్. " గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను,ఆరోగ్య&కుటుంబ సంక్షేమమంత్రిత్వశాఖతో మార్గదర్శకాలను పాటిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఈ వివాదం ఇప్పుడు ఇంకో మలుపు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార పరిధిపై వివాదం మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. వెంటనే వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి కూడా ఎస్‌ఈసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే . ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పిలిచి గవర్నర్ వివరణ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ , చీఫ్ సెక్రెటరీ కి ఘాటైన జవాబు ఇస్తూ, వ్యక్తిగతం గా తనపై వ్యాఖ్యలు చేయడం బాధించినట్టు పేర్కొన్నారు.