English | Telugu
విజయవాడ లో కరోనా పాజిటీవ్ కేసు
Updated : Mar 22, 2020
ఎవరెవరిని కలిశాడో వారిని , ఇంట్లో వారివి శాంపిల్స్ కలెక్ట్చేశాము. ప్రైవేట్ టాక్సీలో వచ్చిన వ్యక్తిని కూడా పరిశీలిస్తున్నాం. ప్రైవేట్ క్యాబ్ హైదరాబాద్ నుంచి విజయవాడ, అక్కడినుంచి గుంటూరుకు ముగ్గురు ప్యాసింజర్లను తీసుకు వెళ్లినట్లు తెలిసింది.
కరోనా పాజిటీవ్ కేసు రావడంతో సిటీని హై అలర్ట్ చేశారు. ఈ కర్ఫ్యూని ఇంకో రెండు రోజులు చేస్తే బాగుంటుందే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే సిటీలో 144 సెక్షన్ అమలులో ఉంది.
విజయవాడ నుంచి గుంటూరు ప్రయాణించిన ప్రయాణికులు స్వచ్చందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్వచ్చందంగా ప్రజలు గుమ్మికూడకుండా సహకరుంచాలని లేదంటే నిర్బందంగా అయినా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.