English | Telugu

కలవరం పుటిస్తున్న కరోనా

కరోనా కి నిర్దిష్ట లక్షణాలు అంటూ ఏమీ ఉండవు. జ్వరం దగ్గు గొంతు లో మంట జలుబు ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. కొందరిలో కడుపునొప్పి డయేరియా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కరోనా వైరస్ కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గమని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా చెబుతున్నారు. పరిశుభ్రంగా ఉండడం వల్ల కరోనా వైరస్ నుంచి తప్పించుకోవచ్చని ఆయ‌న అన్నారు.

మాంసాహారం గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందన్న వార్తల్లో నిజం లేదని గులేరియా తేల్చి చెప్పారు. వేడి వాతావరణం లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గి ఆ తర్వాత క‌నుమరుగవుతుందన్న వార్తలను కూడా గులేరియా కొట్టిపడేశారు. వేడి చల్లని వాతావరణాలు ఉన్న సింగపూర్ యూరోపియన్ దేశాల్లోనూ ఈ వైరస్ విజృంభిస్తోందన్న విషయాన్ని అయన గుర్తుచేశారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోని ఆహారం సమపాళ్లల్లో తీసుకుంటే కరోనా వైరస్ వ్యాపించదంటున్నారు గులేరియా.

కరోనా వైరస్ ముందు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వస్తుంది. మన రోగ నిరోధక శక్తి (ఇమ్యునిటీ)ని పెంచుకోవడం చాలా అవసరం. కరోనా రాకుండా ఇదే అడ్డుకుంటుంది.

ఈ రోగ నిరోధక వ్యవస్థను పెంచుకునేందుకు కొన్ని పదార్థాలు తీసుకోవాలి. పులుపులో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అందులో భాగంగా రోజు ఉసిరి రసం తీసుకుంటే ఎంతో మేలు. దీనిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. విటమిన్ సీ అధికంగా ఉండే నారింజ, జామ, బొప్పాయి వంటివి కూడా తీసుకోవచ్చు.

ఆకుల్లో తులసి ఎంతో ముఖ్యమైనది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ తులసీ ఆకులను రోజూ ఉదయాన్నే ఏమీ తినకుండా వీటిని తీసుకోవాలి.

కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి. పాలలో పసుపును కలిపి తాగాలి. ఇది ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. దీంతోపాటు పాలలో మిరియాలను కూడా కలుపుకొని తాగవచ్చు.
అల్లం వెల్లుల్లి ని ఉదయం తీసుకోవాలి. పొద్దు తిరుగుడు గింజలు - పెరుగు - గ్రీన్ టీ వంటివి కూడా ఎక్కువగా తీసుకోవాలి.