English | Telugu
టీటీడీలో ఇక నుంచి టైమ్ స్లాట్ దర్శనం!
Updated : Mar 17, 2020
మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారు ఆలయానికి రావొద్దని కోరిన టీటీడీ, మంగళవారం నుంచీ టైం స్లాట్ దర్శనాల్ని ప్రారంభించింది. కంపార్ట్‌మెంట్లలో భక్తులను ఉంచే విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. కంపార్ట్‌మెంట్లలో భక్తుల్ని ఉంచితే, సమూహంగా ఉండటం వల్ల కరోనా వ్యాధి ప్రభలే అవకాశం ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
టైమ్ స్లాట్ దర్శనంలో కొండపైకి వచ్చే భక్తులకు ముందుగానే టైమ్ ఫిక్స్ చేస్తారు. వారికి ఇచ్చే దర్శనం టికెట్‌పై టైమ్ స్లాట్ ప్రింట్ చేస్తారు. సరిగ్గా దర్శనం టైముకి భక్తులు క్యూ లైన్ల దగ్గరకు రావాల్సి ఉంటుంది. దర్శనం టికెట్‌పై ఉండే టైమ్ చూసి... క్యూలైన్‌లోకి అనుమతిస్తారు. తద్వారా క్యూలైన్‌లోకి వెళ్లిన భక్తులను మధ్యలో కంపార్ట్‌మెంట్లలో ఉంచకుండా డైరెక్టుగా దర్శనానికి పంపిస్తారు.
ఇలా వెళ్లినా ప్రస్తుతం దర్శనం అవ్వడానికి రెండు నుంచి మూడు గంటలు పడుతోంది. ఈ సమయంలో కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంత వరకూ భక్తులు ఈ సమయంలో కొండకు రాకపోవడమే మంచిదన్న వాదన వినిపిస్తోంది. టీటీడీ మాత్రం అలా భక్తులు రావొద్దని చెప్పట్లేదు. అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే రావొద్దని చెబుతోంది.ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది.
భారతీయులతోపాటూ విదేశీ యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తారు. ఇప్పటికే తిరుపతిలో కరోనా కలకలం ఉంది. చాలా మందిని అనుమానితులుగా రుయా ఆస్పత్రిలో చెక్ చేస్తున్నారు.