English | Telugu

ఏపీ స్థానిక పోరు వాయిదాతో అసెంబ్లీ సమావేశాలు, రాజధాని తరలింపుపై ప్రభావం 

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం కీలక అంశాలపై ప్రభావం చూపిస్తోంది...ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి అనేది సందేహాత్మకంగా మారింది.దీంతో పాటు వైజాగ్ రాజధాని అంశం కూడా చర్చనీయంశం అవుతోంది...

రాష్ట్రంలో కరోనా ప్రభావం తో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడ్డాయి...ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది...సుప్రీం కోర్టు ఏం చెబుతుంది అనేది చూడాల్సి ఉంది..అయితే . దీని ప్రభావం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై పడుతోంద.....మామూలుగా అయితే ఈ నెల చివరి వారంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది..పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది..

కానీ ప్రస్తుతం స్థానిక ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడ్డాయి...దీంతో ఓట్ ఆన్ అకౌంట్ కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలా అనే చర్చ కూడా జరుగుతోంది...అయితే ప్రస్తుతం ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడినా కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంది..ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ సాధ్యం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి.....ఆర్ధిక శాఖ అధికారులతో నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి....

మరో వైపు వైజాగ్ కు రాజధాని తరలింపు పై కూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం పడుతోంద......అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ చివరికంతా షిస్టింగ్ ఉంటుంది అనుకున్నారు..కానీ ప్రస్తుతం పరిస్థితి ఇందుకు అనుకూలంగా లేదు.....ఒక వైపు ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడ్డాయి...ఈ లోపు తరలింపు కష్టమే అనే అభిప్రాయాలు ఉద్యోగుల్లో ఉన్నాయి..అయితే సచివాలయం తరలిచండానికి ఎన్నికలు ఎంత వరకు అవరోధంగా ఉండచ్చు అనే చర్చ కూడా ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది.