English | Telugu
ఇళ్లు దాటాలనిపిస్తే ఇటలీని గుర్తు తెచ్చుకోండి..!
Updated : Mar 23, 2020
ఆ..! నేను బాగానే ఉన్నా. బయటకు ఎందుకెళ్లొద్దు అన్న నిర్లిప్తతకు తావివ్వొద్దు. *ఇటలీలో ప్రభుత్వం చెప్పినా తమ సన్నిహితులను కలుస్తూ గుమిగూడుతూ పరిస్థితిని పీకలమీదకు తెచ్చుకున్నారు.* *గుర్తుంచుకోండి!* మనం పాటించే స్వచ్ఛంద కర్ఫ్యూ కరోనాను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే.
అయినా మీకు బయటికి వెళ్ళి కరోనాను అంటించుకొని చావాలనిపిస్తే ఏ ట్యాంక్‌బండో చూసి చావండి. అంతే కాని మీ కుటుంబసభ్యులను, పక్కింటివారిని, మీ బస్తీవారిని చంపాలనుకుంటే మీరు రోడ్డుమీదకు వెళ్లండి. వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం కాకపోతో ఇటలీ లో బాధితుల వీడియోలను చూడండి.
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తూ మానవాళి మనుగడకే సవాల్ విసురుతోంది. బలహీనులమని భయపడుతున్న మనకిప్పుడు ఓ బలం అవసరం. అదే *సంకల్పం* , *సంయమనం.* *ఇక స్వీయ నిర్బంధం ఇప్పుడు చేయాల్సిన మొదటి పని.
ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలు దాటిపోయాయి. వారం రోజుల్లో ఈ సంఖ్య ఐదు లక్షలు దాటినా ఆశ్యర్యపోనవసరం లేదు. ఎందుకంటే వైరస్ వ్యాప్తి గొలుసుకట్టులా ఉంది. ఇటలీలోనైతే మరణ మృదంగమే మోగుతోంది.
వయసు మళ్లిన వృద్ధులకు వైద్యం అందించలేమని ఇటలీ ప్రభుత్వమే చెప్తోందంటే పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓ యువతి తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకింది. ఐసోలేషన్‌లో వేర్వేరుగా పెట్టి చికిత్స అందిస్తున్నారు. తండ్రి చనిపోయాడు. ఈ సంగతి అతడి భార్యకూ తెలియదు. ఇంట్లో ఉన్న బిడ్డకు సమాచారం అందించారు. అయితే కనీసం తండ్రి ఆఖరి చూపునకూ నోచుకోలేని పరిస్థితి. పౌరులెవరూ బయటకు రావొద్దని ప్రభుత్వ శాసనం. శ్మశాన వాటికకు తీసుకెళితే అక్కడా మృతదేహాల వరుస. ఏ సమయంలో విద్యుత్ దహనం చేస్తారో తెలియని ఆవేదన. అమ్మ బతుకుతుందో లేదోనన్న బెంగ. ఈ పరిస్థితులను ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు మన దేశం ఎంత భద్రంగా ఉందో తలచుకోండి. *మనమిలాగే సురక్షితంగా ఉండాలంటే స్వీయ నిర్బంధమే మనముందున్న ఏకైక మార్గం.*
*సామాజిక దూరం అనుసరించడం. పటిష్ఠ జాగ్రత్తలు తీసుకోవడం.*
*కరోనా వైరస్ గాల్లో 3 గంటలు, రాగి పాత్రలపై 4 గంటలు, కార్డ్‌బోర్డులపై 24 గంటలు, స్టీల్ పాత్రలపై 2-3 రోజులు, ప్లాస్టిక్ పాత్రలపై 4 రోజులు బతికుంటుందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్‌లో వచ్చిన పరిశోధన వెల్లడించింది.* కాబట్టి మీతో పాటు మీ కుటుంబాన్ని ఘోరాతి ఘోరంగా చంపాలనుకుంటే రోడెక్కండి.