English | Telugu

ఇట‌లీలో కరోనా విలయతాండవం పిట్టల్లా రాలిపోతున్న జ‌నం!

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతటి ఉపద్రవానికి దారితీస్తుందో మిగతా దేశాలకు ఇటలీ పరిస్థితి గుణపాఠం నేర్పుతుంది. ఇప్పటికే కోవిడ్-19 మరణాల్లో ప్ర‌పంచంలో అత్యధికంగా 5476 మంది చనిపోయారు. కరోనాను కట్టడి చేయడం కోసం ఆ దేశంలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది శక్తికి మించి పని చేస్తున్నారు. ఇటలీలోని వేలాది మంది డాక్టర్లు, నర్సులు కూడా కరోనా బారిన పడ్డారు.

కోవిడ్‌ను అదుపు చేయడం ఇటలీకి తలకు మించిన భారం అవుతోంది. దీంతో ఆ దేశం సాయం కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తోంది. 60 వేల మంది కరోనా బారి పడగా.. 5476 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులోనే ఇటలీలో 651 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తుండటంతో... శవాలను ఖననం చేయడానికి కూడా వేచి చూడాల్సి వస్తోంది. ఆ ప‌రిస్థితిని చూడ‌లేక ఇట‌లీ అధ్య‌క్షుడు భోరున విల‌పించారు. రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పెరుకుపోతున్న శవాలు,శవాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్ళను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు!! కేవలం 6 కోట్ల జనాభా కలిగిన దేశం ప్రపంచంలోనే అత్యాధునిక వైద్యసాదుపాయలు కలిగిన దేశ అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తేసి బోరున విలపించాడు. ఈ దృశ్యాల‌ను చూసైనా తెలుగు ప్ర‌జ‌ల్లో మార్పు రావాల్సి వుంది. నిర్భంగా బ‌య‌టికి రాకుండా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ఇట‌లీ నేర్పిస్తున్న గుణ‌పాఠం.