English | Telugu
దేశంలో 110కి చేరిన కరోనా కేసులు
Updated : Mar 16, 2020
మన దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 110కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. వారిలో 17 మంది విదేశీయులు ఉన్నారని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి ఉన్నారు. దేశంలో అత్యధిక కరోనా బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. అనంతరం కేరళలో అత్యధికంగా 22 మంది ఉన్నారు. హర్యానాలో 14, ఉత్తరప్రదేశ్‌లో 11, ఢిల్లీలో 7, కర్ణాటకలో 6 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
కరోనా వైరస్ పయనం చాలా ప్రమాదకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ మొదటి రెండు వారాలు ఒకరిద్దరూ పదుల సంఖ్యకే పరిమితమైంది. ఆ తర్వాత వేల మందికి సోకింది. మూడో వారం నుంచి దీని ఉధృతి పెరిగి నాలుగో వారానికి వేలమందికి సోకుతుందని అధ్యయనంలో తేలింది. ఇండియాలోనూ అదే పరిణామం చోటుచేసుకోవడం దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
భారత దేశంలో మొదటి వారం - 3 కేసులు నమోదయ్యాయి. రెండోవారం ఆ సంఖ్య 24కు పెరిగింది. 3వ వారం ఏకంగా105 మంది రోగులుకు పెరిగారు. ఇప్పుడు 4వ 5వ వారాలు దేశంలో అత్యంత కీలకం. అందుకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నింటికి సెలవులు ఇచ్చేశాయి. కరోనా వ్యాప్తి చెందకుండా మీటింగ్ జనసమూహాలు జనసమ్మర్థ ప్రాంతాలను ఖాళీ చేశాయి. నిషేధాజ్ఞలు విధించాయి. ఈ రెండు వారాలు ఎవరూ ఇల్లు దాటి బయట అడుగుపెట్టకుంటే కరోనా మనం నియంత్రించవచ్చు. తొందరపడి బయటకు పోతే మాత్రం కరోనా కల్లోలం దేశంలో విస్తరించడం ఖాయం అని శాస్త్రవేత్తలు ఈ లెక్కల ఆధారంగా చెబుతున్నారు. వచ్చే ఈ రెండు వారాలు భారతదేశానికి కీలకమైనవి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కోరుతోంది. వృద్ధులు పిల్లలను ఎంత వీలైతే అంత దూరంగా ఇంట్లోనే ఉంచితే బెటర్ అని సూచిస్తున్నారు. వారికి సోకితే ప్రాణాలు పోవడం ఖాయమంటున్నారు.
ఇప్పుడు కరోనా స్టేజ్ 3 వ దశలో ఉన్నాం. మెడికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రకారం వచ్చే 30 రోజులు చాలా కీలకం. ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే దేశంలోంచి కరోనాను మనం తరిమికొట్టవచ్చు.