English | Telugu
కరోనా స్పెషల్ ఆఫర్లు ప్రకటించిన జియో, ఈరోస్ నౌ!
Updated : Mar 21, 2020
ఈరోస్ నౌ యాప్ ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది. రాబోయే రెండు నెలలు ఉచితంగా వాడుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. ఈ యాప్ లో ఎవరైతే 'స్టే ఫ్రీ' అని ఇంగ్లీష్ కోడ్ ఉపయోగిస్తారో వాళ్లకు రెండు నెలలు యాప్ లోని సినిమాలు.. ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలను ఉచితంగా పొందవచ్చు. కాగా, ఇదే పద్దతిలో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి అప్లికేషన్స్ కూడా ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటి నుంచి పని చేసేవారికి అదనపు ప్రయోజనాలను కలిగిస్తూ నూతన 4జీ డేటా వోచర్లను తాజాగా ప్రకటించింది. 4జీ సౌకర్యంతో పాటుగా టాక్‌టైమ్‌ను రూ. 11 నుంచి రూ. 101 ప్లాన్స్ వరకు అందుబాటులో ఉంచింది. ఒకసారి అధిక వేగంతో డేటా ముగిసిన తర్వాత 64 కేబీపీఎస్‌తో అపరిమితంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది జియో. కేవలం 11 రూపాయలకు - 800ఎంబీ డేటా.. 75 నిమిషాల టాక్‌టైమ్. 21 రూపాయలకు - 2జీబీ డేటా.. 200 ని.టాక్‌టైమ్, 51 రూపాయలకు - 6జీబీ డేటా.. 500 ని.టాక్‌టైమ్, 101 రూపాయలకు - 12 జీబీ డేటా.. 1000 ని.టాక్‌టైమ్ అందిస్తున్నారు. అయితే రూ.251 వోచర్‌కు మాత్రం అదే పాత ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచి పని చేయాలని కోరిన నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ఇండియా అంతటా భారీగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది.