English | Telugu
టీడీపీ కార్యాలయంలో కరోనా భద్రత...
Updated : Mar 17, 2020
సేఫ్ జోన్ లో పార్టీ కార్యాలయం....
ఏపీ లోని టిడిపి ప్రధాన కార్యాలయంలో కరోనా భద్రతా ఏర్పాట్లు చేసారు... గుంటూరు జిల్లా మంగళగిరి ప్రధాన కార్యాలయంలో కరోనా వైరస్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు... క్రమశిక్షణ గల పార్టీగా టిడిపికి మంచి పేరుంది... ప్రక్రుతి విపత్తులు, జాతీయ విపత్తులు సంభవించినపుడు ప్రజా సేవలోనే కాక పార్టీ సేవలో కూడా టిడిపి నాయకత్వం ద్రుష్టి పెడుతుంది. అందులో భాగంగానే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేసారు... అత్యవసరం అయితే తప్ప నాయకులు జిల్లాల నుంచి రావద్దని ఆదేశాలు అందాయి... అంతే కాక కార్యకర్తలు కూడా వివిధ జిల్లాల నుంచి రావొద్దని పిలుపిచ్చారు... పార్టీ కార్యాలయంలో అందరికీ ధర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేసారు... పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో సహా పార్టీ కార్యాలయంలోకి వచ్చే అంధరికీ స్కానింగ్ చేస్తున్నారు.
100 డిగ్రీల శరీర ఉష్టోగ్రత దాటిన వారికి పార్టీ కార్యాలయంలోకి ఎంట్రీ లేదు... వీరు ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి... స్కానింగ్ తర్వాతే పార్టీ కార్యాలయంలోకి నేతలు అడుగు పెట్టాలి.. స్కానింగ్ లో ఎవరి కైనా టెంపరేచర్ ఎక్కువ ఉంటే తక్షణం వారికి వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.. సాక్షాత్తూ చంద్రబాబే అందరకి ఆరోగ్య జాగ్రత్తలు చెబుతున్నారు.... కరోనా దేశ వ్యాప్తంగా అలజడి కలిగిస్తోంది..జనాన్ని బాగా భయపెడుతోంది..దీంతో టిడిపి కార్యాయలంలో ముందు జాగ్రత్తలపై ద్రుష్టి పెట్టారు... ఇలాంటి సమయంలో టిడిపి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడమే కాక పార్టీ కార్యకర్తలు, నాయకులకు మంచి క్రమశిక్షణ అందించడంలో ముందుంటుంది అనే చర్చ పార్టీ కార్యాలయంలో జరుగుతోంది.