English | Telugu

ఇండోనేషియ‌న్లు పెట్టిన చిచ్చు.. కరీంనగర్‌లో 76వేల మందికి స్క్రీనింగ్

ఇండోనేషియా నుంచి వచ్చిన వారు 70మంది కలిసినట్టు అధికారులు గుర్తించారు. ఇంటింటికీ వెళ్లి అనుమానితులను వైద్య బృందాలు గుర్తిస్తున్నాయి. మూడు రోజుల్లో ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో సంచరించారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలెక్టరేట్‌‌కు అతి సమీపంలోని మ‌సీదుల‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మార్చి 14,15 తేదీల్లో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరు సంచారించారని అధికారులు గుర్తించారు. ఇంకా వీరు తిరిగిన ప్రాంతాలను తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక ఇండోనేషియన్ల పుణ్యమా అని కరోనా వైరస్ కరీంనగర్ కు పాకింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన మత ప్రచారకుల బృందంలో 9మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన ఇండోనేషియన్లు కరీంనగర్ లో బస చేశారు. కరీంనగర్ నగరంలో కరోనా బాధితులను గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కరీంనగర్ ను జల్లెడ పడుతున్నారు.

కరీంనగర్‌లో 50 వేల మందికి పరీక్షలు చేశాం. అయితే ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలకు అసౌకర్యం కలగొద్దని కరీంనగర్‌ పర్యటన వాయిదా వేసుకున్నానని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఇండోనేషియన్లు ఎక్కడెక్కడ తిరిగారో విచారణ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టులు, పోర్టులు మూసివేయాలని ప్రధానికి చెప్పాను. ఒకేసారి మూసివేయడం కూడా సాధ్యం కాదని సి.ఎం. చెప్పారు.