English | Telugu
సీఏఏ నిబంధనల ప్రకారం ఎవరూ ఈ దేశ పౌరులు కారంటున్న కేసీఆర్
Updated : Mar 16, 2020
తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీ సర్కార్‌కు గట్టి షాక్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి సంచలన కామెంట్స్ చేశారు. సీఏఏ నిబంధనల ప్రకారం చూస్తే ఎవరూ ఈ దేశ పౌరులు కారని కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలో చాలా మందికి బర్త్ సర్టిఫికెట్ లేదని.. తనకు కూడా బర్త్ సర్టిఫికెట్ లేదని. ఇప్పుడు దాన్ని తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని సీఏఏ తీరును అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కడిగిపారేశాడు. ముఖ్యమంత్రి అయిన నా పరిస్థితియే ఇలా ఉంటే కూలీలు - పేదలు - మహిళల పరిస్థితి ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. హిందూ - ముస్లింల సమస్య సీఏఏ కాదన్నారు.
విచిత్రమైన పద్ధతి, నిబంధనలు సీఏఏలో పెట్టారని కేసీఆర్ ఎండగట్టారు. ఓటర్ ఐడీ కార్డు కూడా పనిచేయకపోతే బర్త్ సర్టిఫికెట్లు లేని వారు దేశంలో కోట్ల మంది ఉన్నారని.. వారి పరిస్థితేంటని నిలదీశారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారంతా దేశ ద్రోహులు అవుతారని అని బీజేపీ ప్రచారంపై కేసీఆర్ మండిపడ్డారు. సీఏఏపై దేశంలో సమీక్ష జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల భావోద్వేగాలను బీజేపీ రెచ్చగొట్టడం సరైందని కాదని స్పష్టం చేశారు. సీఏఏపై పునసమీక్షించాలని కేసీఆర్ కోరారు. సీఏఏ వల్ల ఢిల్లీలో 50మంది చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ ఎస్, సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ ఫిబ్రవరి 16న తీర్మానం కూడా చేసింది. ఇప్పటికే కేరళ - బెంగాల్ - పంజాబ్ - రాజస్థాన్ - చత్తీస్ ఘడ్ - ఢిల్లీలు కూడా అసెంబ్లీలో సీఏఏను వ్యతిరేకించి తీర్మానం చేశాయి.