English | Telugu

కనిపిస్తే లోపలెయ్యండి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు!

ఈ నెల 31 వ‌ర‌కు ఇంట్లో ఉంటారా? లేక జైల్లో ఉంటారో తేల్చుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు హెచ్చ‌రిస్తున్నాయి. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఇంతకంటే వేరే మార్గం లేదని కేంద్ర‌ ప్రభుత్వం రాష్ట్రాల‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైన విషయాలకు తప్పితే, ఎవరైనా బయట తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు కేవ‌లం 75 జిల్లాల్లోనే లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలను లాక్‌ డౌన్ చేయాలంటూ లేటెస్ట్‌గా కేంద్రం ఆదేశించింది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 425కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17,493 మంది వ్యక్తుల నుంచి 18,383 శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది.