English | Telugu

4ల‌క్ష‌ల 76వేల 692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద శుభవార్త చెప్పింది. త్వరలో 4,76,692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో 4,75,000 పైగా పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు వివరించారు.

2019-20 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB మొత్తం 1,34,785 పోస్టుల్ని భర్తీ చేయాలని సిఫార్సు చేసినట్టు జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా వివరించారు. యూపీఎస్‌సీ ద్వారా 4,399 ఖాళీలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 13,995 ఖాళీలు, ఆర్ఆర్‌బీ ద్వారా 1,16,391 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు.

యూపీఎస్‌సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్‌బీ మాత్రమే కాదు... రక్షణశాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ద్వారా అదనంగా మరో 3,41,907 పోస్టుల్ని భర్తీ చేస్తామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఖాళీల వివరాలను యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ లాంటి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు తెలపాలని కోరినట్టు వివరించారు. కేంద్ర సహాయ మంత్రి రాజ్యసభకు వివరించిన దాన్నిబట్టి కేంద్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. కాబట్టి నిరుద్యోగులు ఎప్పటికప్పుడు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు జారీ చేసి జాబ్ నోటిఫికేషన్లపై దృష్టి పెట్టడం మంచిది.

10వ త‌ర‌గ‌తి, ఇంటర్, పాస్ అయ్యి ఉద్యోగ అర్హత తక్కువ‌ ఉందని అనుకునే వారికి కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉద్యోగాలని భర్తీ చేయనుంది. కేంద్ర మంత్రిత్వశాఖలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ బీ, సి పోస్టుల భర్తీ కి చర్యలు చేపట్టింది.