English | Telugu

సిఎం.జగన్మోహన్ రెడ్డి 'అహం' దెబ్బతిందా..?

సెరిబియాలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న నిమ్మగడ్డ ప్రసాద్ “క్రిడ్ ప్రో” లో భాగంగా జగన్ సంస్ధలకు రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టారని, వైఎస్సార్ ఫౌండేషన్‌కు రూ.7 కోట్లు విరాళం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన విషయంలో లేని 'కులం'.. హఠాత్తుగా ఎన్నికల వాయిదా విషయానికి వచ్చేసరికి ఈ 'నిమ్మగడ్డ' విషయంలో ఏమిట‌ని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ 'విచక్షణ' కోల్పోయి ప్రవర్తించాడని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. 'కరోనా వైరస్ కారణం చూపి ఎన్నికలు వాయిదా వేసిన రమేష్ కుమార్ అధికారులను బదిలీలు ఎలా చేస్తాడు' అని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు కులం చుట్టే తిరుగుతున్నాయి. గతంలోనూ కులం ప్రభావం బలంగానే ఉన్నా, దానిపై లోలోపల చర్చ జరిగేది. బహిరంగంగా మాత్రం ప్రతి పార్టీ, ప్రతి నాయకుడూ.. 'లౌకికవాదం' ముసుగులో కుల, మతరహిత మాటలే మాట్లాడేవాళ్లు. కానీ ఇప్పుడు 'రెడ్డి వర్సెస్ కమ్మ..! ఏపీ రాజకీయాలు అంటేనే పూర్తి డిఫరెంటు..! ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ 'నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌' పై నేరుగా కులం పేరిటే దాడి చేశారు. తనను చంద్రబాబు నియమించుకున్నాడు కాబట్టి తన చాయిస్ కాబట్టి తన సామాజికవర్గం కాబట్టి తెలుగుదేశం ఈ ఎన్నికల్లో గల్లంతు కాబోతున్నది, టీడీపీ ఇంకా సంక్షోభంలోకి జారిపోబోతున్నది కాబట్టి తట్టుకోలేక ఎన్నికల్ని కరోనా సాకుతో వాయిదా వేశారా..? అన్నట్టుగా ఓ ముఖ్యమంత్రి ఓ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ను నేరుగా ప్రశ్నించడం అసాధారణమే…!

ఎవరో రాస్తున్నారు, ఎవరో పంపిస్తున్నారు, ఈయన ఆర్డర్ చదివేస్తున్నాడు అని ఆరోపించడం ద్వారా పరోక్షంగా చంద్రబాబు పంపించిన ఆదేశాలనే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ తూచతప్పకుండా పాటిస్తున్నాడని చెప్పాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల్ని వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంతో కోపగించిన జగన్ మొదట గవర్నర్‌ ను కలిసి తన అసంతృప్తిని తెలిపారు.

సుప్రీంకోర్టు ఇలాంటి సందర్బంగా ఓ తీర్పు వెలువరించింది. అదే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఆదర్శంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కిషన్ సింగ్ తోమార్, మున్సిపల్ కార్పోరేషన్ మధ్య జరిగిన అప్పీల్ నెం.(సివిల్): 5756/2005 కేసులో ఎన్నికల కమిషన్ కు ఎన్నికల నిర్వహణలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని 19, అక్టోబర్, 2006కేసులో చెప్పింది. ఈ తీర్పు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్ళే అవకాశం లేదని న్యాయ నిపుణుల అభిప్రాయం.