English | Telugu

బీ అలెర్ట్.. కరెన్సీని టచ్ చేస్తే.. కరోనా సోకినట్టే!!

కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం జనమంతా 'షేక్ హ్యాండ్ వద్దు నమస్కారం ముద్దు' అంటున్న సంగతి తెలిసిందే. షేక్ హ్యాండ్ఇస్తే ఎక్కడ వైరస్ ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే షేక్ హ్యాండ్అంటే నై నై అంటున్నారు. అయితే కరోనా ఉన్న వ్యక్తుల్ని తాకడం వల్లనే కాదు, వారు తాకిన వస్తువుల్ని తాకినా వైరస్ అంటుకుంటుంది. అందుకే అనవసరంగా వేటిని తాకవద్దని, ఎప్పటికప్పుడు వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు మనం ఊహించని విధంగా కూడా వైరస్ విస్తరించే అవకాశముందని తెలుస్తోంది. అదే కరెన్సీ. నోట్లు ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారడం వల్ల కూడా వైరస్ విస్తరించే ప్రమాదముంది.

నోట్ల రద్దు పుణ్యమా అని.. మన దేశంలో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ అలవాటైంది. టీ స్టాల్, కిరాణ షాపులు మొదలు పెద్ద పెద్ద షాపింగ్ ల వరకు.. మొబైల్ యాప్స్ తో డబ్బు చెల్లించడం యువతకి అలవాటైంది. అయితే ఇది పదిశాతం కూడా ఉండదు. తొంబై శాతానికి పైగా నగదు ఇప్పటికీ చేతులు మారుతూనే ఉంది. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కొందరికి నోట్లు లెక్కించేటప్పుడు.. వేలిని నాలుకపై పెట్టి తడి చేయడం అలవాటు. ఒక వేళ కరోనా సోకిన వ్యక్తి తడి చేసి నోట్లను లెక్కిస్తే.. ఆ వైరస్‌ నోట్లకూ పాకుతుంది. కరోనా వైరస్‌ వ్యక్తి నుంచి నోట్లు బయటకి వస్తే.. ఆ నోట్ల పై ఉన్న వైరస్ అంతరించేలోపు.. ఎందరో చేతులు మారే అవకాశముంది. అదే జరిగితే ఎందరో చేతికి వైరస్‌ చేరినట్లే. దాని వల్ల జరిగే నష్టం ఊహకు కూడా అందదు. అందువలన ఎవరైనా సరే.. నోట్లను నోటితో తడి చేయకుండా లెక్కిస్తే మంచిది. అదేవిధంగా వీలైనంతవరకు నగదు చెల్లింపులు.. మొబైల్ పేమెంట్ యాప్స్ లేదా ఆన్ లైన్ ద్వారా చెల్లిస్తే మంచిది.