English | Telugu

పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోవ‌ద్దు!

పెంపుడు జంతువుల వల్ల క‌రోనా వైరస్ వస్తుందా? ఏమో! హాంగ్ కాంగ్ లో రెండేళ్ల జర్మన్ షెపర్డ్, 17 ఏళ్ల పోమెరేనియన్ కుక్కుల పై కరోనా వైరస్ టెస్టు చేశారు. ఆ టెస్టులో వాటికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ కుక్కలను నిర్భంధంలో ఉంచారు. ఆ తర్వాత వాటి నిర్భందం నుంచి విడుదల చేసిన రెండు రోజులకే చనిపోయాయి. వారి యజమానులకు కూడా కరోనా వైరస్ టెస్టు చేస్తే పాజిటివ్ అని వచ్చింది. ఈ వైరస్ మానవుల నుండి కుక్కలకు వ్యాపిస్తుందని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. హాంగ్ కాంగ్ జంతు-సంక్షేమ ఆథారిటీ, పెంపుడు జంతువుల యజమానులకు ఈ సంద‌ర్భంగా కొన్ని సూచనలు చేసింది. పెంపుడు జంతువుల ప‌ట్ల‌ పరిశుభ్రత పద్ధతులను పాటించమని గుర్తు చేసింది మరియు వారి పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోకుండా ఉండమని వారిని కోరింది.

అయితే ఇప్పటివరకు పెంపుడు జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని చెప్పటానికి ఖ‌చ్చిత‌మైన ఆధారాలు లేవు. పారిస్ ఆధారిత వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ప్రకారం , యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మరియు వెట్ డయాగ్నొస్టిక్ కంపెనీ ఐడిఎక్స్ఎక్స్ పెంపుడు జంతువుల నుండి కోవిడ్ -19 సంక్రమిస్తుందా అనే విషయం పై వేలాది కుక్కలు మరియు పిల్లులను పరీక్షించింది. కానీ ఈ పరీక్ష ద్వారా పెంపుడు జంతువుల నుండి కోవిడ్ 19 సంక్రమిస్తుందని నిర్ధారించలేదు.