English | Telugu
కుటుంబసభ్యులతో సరదాగా బీజేపీ నేతలు
Updated : Mar 22, 2020
బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జనతా కర్ఫ్యూ లో భాగంగా కుటుంబంతో ఇంట్లో సమయాన్ని గడుపుతున్నారు. కుటుంబసభ్యులతో సరదాగా చెస్ ఆడుకున్నారు. ప్రధాని పిలుపు మేరకు ప్రజలంతా ఐక్యత ప్రదర్శిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో ఈ కార్యక్రమం విజయవంతం అయిందని ఆయన అన్నారు. ఇలాంటి కర్యాక్రమాన్ని చేపట్టి ప్రపంచానికే మార్గదర్శకంగా ప్రధాని మోదీ నిలిచారని సంజయ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణా ఈ వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సి.ఎం. ఇచ్చిన పిలుపు మేరకు 24 గంటలు పాటించడం సంతోషకరమని ఆయన అన్నారు.
మాజీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్. మేమంతా ఇంటికే పరిమితం అయ్యాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు బయటికి వెళ్ళకుండా ఐక్యత ప్రదర్శించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్ననిర్ణయానికి ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.