English | Telugu
రాజకీయ నేతల ప్రమేయం వల్లే ఆయేషాకు న్యాయం దొరకలేదు!
Updated : Mar 21, 2020
బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను తన హాస్టల్‌లోనే అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఉమెన్ హాస్టల్‌లో జరిగింది. అప్పట్లో ఆయేషా మీరా హత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో అసలైన నిందితులను రాజకీయ నాయకుల ప్రమేయంతో తప్పించారని.. తమకు న్యాయం చేయాలని ఆయేషా తల్లి శంషాద్ బేగం కోరుతున్నారు. దాదాపు 12 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలన సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా హత్యాచారానికి గురైంది.
నిర్బయ చట్టం తీసుకొచ్చారని దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. దేశం ధనికులు, పేదలు అనే రెండు వర్గాలుగా చీలిపోయిందన్నారు. తన కుమార్తె పేరుతో ఎలాంటి చట్టాలు తీసుకురాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె కేసులోనూ నేరస్థులను పట్టుకుని, సీబీఐ ద్వారా శిక్ష వేయిస్తే చాలా గర్విస్తామని అన్నారు. తన కుమార్తె పేరుతో ఆయేషా చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకురాగలరా? అని ఆమె ప్రశ్నించారు.