English | Telugu

కరోనా బాధితులకు హెచ్ఐవీ డ్రగ్‌

కరోనాకు మందు లేకపోవడంతో ప్రభుత్వాలు నియంత్రణ చర్యలను చేపట్టాయి. ఆస్ట్రేలియాలోని యూనివర్శిటి ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ సెంటర్ ఫర్ క్లినికల్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కరోనాకు మందు ఉందంటున్నారు. క్లోరోక్విన్, లోపినవిర్ అనే రెండు డ్రగ్స్ కరోనాను నయం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు డ్రగ్స్‌ను సహజంగా మలేరియా, హెచెఐవీ బాధితులకు ఉపయోగిస్తారు. అయితే కరోనాను నయం చేసేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఈ డ్రగ్స్ టెస్ట్ ట్యూబ్‌లలో వైరస్‌ను తొలగించాయని రీసెర్చ్‌ను లీడ్ చేస్తున్న డేవిడ్ పీటర్‌సన్ తెలిపారు. ఈ చికిత్స చాలా ఉపయోగకరమైనదని, చికిత్సానంతరం బాధితులలో ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించవని ఆయన అన్నారు.

ముందుగా 50 ఆసుపత్రులను ఎంచుకుని ఈ రెండు డ్రగ్స్‌ను విడివిడిగా ఉపయోగిస్తే ఎటువంటి ఫలితం వస్తోంది.. కలిపి ప్రయోగిస్తే ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపై పనిచేయాల్సి ఉందన్నారు.

చైనాలో ఇప్పటికే అనేక మంది కరోనా బాధితులకు హెచ్ఐవీ డ్రగ్‌ను ఇవ్వగా.. మంచి ఫలితాలు ఇస్తుంద‌ట‌.