English | Telugu
సుప్రీం కోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్
Updated : Mar 16, 2020
అనుకున్నట్టే జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా వేయడంపై జస్టిస్ లలిత్ ధర్మాసనం వద్ద మెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం. రేపటి లిస్ట్ లో పెట్టాలని రిజిస్ట్రార్ ను ఆదేశించిన జస్టిస్ లలిత్ బెంచ్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదల పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం. రేపు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు. ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదల అంశాన్ని జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందు ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు. రేపటి కేసుల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించిన జస్టిస్ లలిత్.
రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా రాష్ట్ర ఎన్నికల అధికారి వేయడం పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉండగా, ఈ రోజు ఉదయం దాదాపు గంటకు పైగా గవర్నర్ తో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ , కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందనే విషయాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు.
బందర్ రోడ్డులోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గవర్నర్ తో చర్చించిన అంశాలను అధికారులతో వివరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మరికాసేపట్లో పత్రికా ప్రకటన విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్గ. గ వర్నర్ తో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పత్రికా ప్రకటనలో వివరించే అవకాశం . రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నానే విషయాన్ని ప్రకటనలో తెలియజేయనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.