English | Telugu

సి.ఎం.కు బ్యాడ్ టైం.. రాజ‌ధాని మార్పు ప్లాన్ త‌ల‌కిందులైంది!

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మగడ్డ నిర్ణయంతో ముఖ్య‌మంత్రి జగన్ షాక్ గురైయ్యారు. ఏప్రిల్ 6 నుంచి జూన్ 10 లోపు రాజధాని మార్చాలని కొన్న జగన్ ప్లాన్ తలకిందులైంది. ఎందుకంటే ఆరు వారాల వ్యవధి ఏప్రిల్ నెల ఆఖరికి ముగుస్తుంది. ఆ తరువాత నాలుగు వారాల పాటు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది అనగా మే నెల ఆఖరికి చేరుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఉద్యోగుల్ని తరలించాలి అంటే అనేక సవాళ్లు ఎదురవుతాయి. స్కూల్ పిల్లల అడ్మిషన్లు కాలేజీ అడ్మిషన్లు వంటి అనేక సమస్యలు ఉద్యోగులు ప్రస్తావిస్తారు. అందువలన ఈ సంవత్సరానికి రాజధాని తరలింపు అనేది అటక ఎక్కినట్టే.

151 సీట్లు వచ్చినా - లేదంటే మొత్తం 175 స్థానాలు గెలిచినా కూడా రాజ్యాంగ బద్దంగా నడిచే సంస్థపై ఆరోపణలు చేయడం పై సి.ఎం. ఇరుక్కున్నారు. ముఖ్యమంత్రికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ విషయాన్ని జగన్ గమనిస్తే మంచిది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగినంత కాలం ఇండ్ల స్థలాల పంపిణీని నిలిపివేసే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. సరైన కారణాలతో ఎన్నికలను వాయిదా వేసే అధికారి కూడా ఈసీకి ఉంది. రాజ్యాంగ బద్ధ సంస్థలపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించి కామెంట్ చేయాలి అంటూ జగన్ పై ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు తనదైన రేంజిలో సెటైర్ల వర్షం కురిపించారు.

ఇప్పటికే మందు డబ్బు పంపిణీ చేసిన జగన్ వాయిదా కారణంగా మరల ఆరు వారాల పాటు తన అభ్యర్థులను పోషించాల్సిన పరిస్థితి ఉంది. కొద్ది సమయంలో విపక్షాలు బలపడటానికి అవకాశాలు చాలా ఉన్నాయి.