English | Telugu

రాజధాని కోసం ఆగిన మరో గుండె.. ఉద్యమించిన గొంతు మూగబోయింది!

ఏపీ రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందనే మనస్థాపంతో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు గ్రామానికి చెందిన కంచర్ల చంద్రం(43) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. రాజధాని కోసం 31 సెంట్ల భూమి ఇచ్చిన చంద్రం.. రాజధాని ఉద్యమంలో తొలి నుంచీ చురుగ్గా పాల్గొన్నారు. రాజధాని తరలిపోతోందని పదే పదే ఆలోచించి తల నరాలు చిట్లి చంద్రం చనిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని ప్రచారం మొదలైన నాటి నుండి రాజధానిలో రైతులు తీవ్ర మానసిక వేదనతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక నేడు రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న మరొక రైతు చంద్రం ప్రాణాలు కోల్పోయారు. రాజధాని కోసం పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోవడం సామాన్యులని సైతం కలచివేస్తోంది.