English | Telugu

ఫలించనివ్యూహాలు... మే లోగా ఏపీ సచివాలయం తరలింపు సాధ్యమేనా?

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉగాదికి ఏపీ సచివాలయం వైజాగ్ కు తరలించాలని ప్లాన్ చేసుకున్నారు.. కానీ ప్రస్తుత పరిస్తితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు...ఉగాదికి ప్రోసెస్ మొదలుపెట్టి ఏప్రిల్ చివరికల్లా క్లోజ్ చేద్దామనే ఆలోచనతో ముందుకు వెళ్లింది ప్రభుత్వం. కానీ న్యాయస్థానాలు, కరోనా ప్రబావం ఈ ప్రక్రియకు పెద్ద బ్రేక్ వేసేసింది...కరోనా ప్రభావం తగ్గేందుకు కనీసం మూడు నెలలు సమయం పట్టేలా ఉంది.. ఈ లోపు తరలింపు కూడా కష్టమే.. ప్రధానంగా ఇఫ్పుడు ప్రయాణాలు చేసే పరిస్థితి కూడా లేదు..ఒక వేళ కాదూ కూడదు అని చేసినా రకరకాల ఇబ్బందులు...

మరో వైపు ఆరు వారాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది....ఇవి పూర్తయితే కానీ తరలింపు అంశం ముందుకు కదలదు... స్థానిక సంస్తల ఎన్నికలు ఆరు వారాల్లో పూర్తి అవుతాయా లేక మరికొంత కాలం పొడిగిస్తారా అనేది కూడా చర్చనీయాంశమే...ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావంతీవ్రంగా ఉంది.....ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమే......దీంతో షిప్టింగ్ కు ఎన్నికలు కూడా ఇబ్బందే... మరో వైపు ప్రస్తుతం నాలుగు రోజులు అసెంబ్లీసమావేశాలు జరిపి కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టనున్నారు.పూర్థి స్తాయి బడ్జెట్ కు మరో మూడు నెలలు సమయం కావాలి...ఒక వేళ మే లో షిప్టింగ్ జరిగినా మళ్లీ బడ్జెట్ సమావేశాల కోసం వెంటనే అమరావతి రావాల్సి ఉంటుంది...

ప్రధానంగా న్యా య స్థానాల్లో కొన్ని కేసులు నడుస్తున్నాయి..ఇప్పటికే కర్నూలుకు రెండు కార్యాలయాలు తరలింపు వద్దని హైకోర్టు చెప్పింది....అమరావతి రైతుల కేసులు కూడా ఉన్నాయి..ఈ రైతుల సమస్ పరిష్కారం కాకుండా ముందుకెళ్లే పరిస్థితి కూా డా లేదు.దీంతో సీఎం అనుకున్నదొక్కటీ...అయ్యిందొక్కటీ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి...